ఢిల్లీలో ఫ్యాషన్ డిజైనర్ మృతి.. హత్య.. ఆత్మహత్యా..!
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని ఓ ఫ్యాషన్ డిజైనర్ ఇంట్లో గురువారం మృతదేహం లభ్యమైంది. ఆత్మహత్యగా అనుమానిస్తున్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారణ చేస్తున్నారు.
వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్ అయిన 26 ఏళ్ల మహిళ గురువారం ఉదయం ఢిల్లీలోని సప్దర్ జంగ్ ఎన్‌క్లేవ్‌లోని తన ఇంట్లో శవమై కనిపించింది.
మృతి చెందిన మహిళ దీపికగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్ కు తరలించారు. దీపిక గత కొంతకాలంగా ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నట్లు సమాచారం.
Details
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దీపిక మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ దొరికిందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
అసలేం ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. దీపికా సూసైడ్ చేసుకుందా.. ఎవరైనా హత్య చేసి సూసైడ్‌గా చిత్రీకరిస్తున్నా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే దీపికా మృతిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.