LOADING...
Bapatla : బాపట్లలో ఘోర ప్రమాదం.. గ్రానైట్ క్వారీలో ఆరుగురు కార్మికులు మృతి!
బాపట్లలో ఘోర ప్రమాదం.. గ్రానైట్ క్వారీలో ఆరుగురు కార్మికులు మృతి!

Bapatla : బాపట్లలో ఘోర ప్రమాదం.. గ్రానైట్ క్వారీలో ఆరుగురు కార్మికులు మృతి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2025
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాపట్ల జిల్లాలో శనివారం ఉదయం ఘోర విషాదం చోటు చేసుకుంది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో బండరాయి జారి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతులు ఒడిశాకు చెందినవారిగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు.

Details

సూమారు 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం

శిథిలాల కింద చిక్కుకున్న గాయపడిన కార్మికులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించిన సమయంలో క్వారీలో సుమారు 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో మరిన్ని ప్రాణనష్టం జరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గ్రానైట్ క్వారీలో కూలిన శిథిలాలను అధికారులు, క్వారీ సిబ్బంది కలిసి తొలగించే పనిలో ఉన్నారు.