Page Loader
Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
యూపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2024
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఇటావా జిల్లాలోని ఉస్రహార్ ప్రాంతంలో లఖ్‌నపూ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌పై శనివారం రాత్రి జరిగింది. లక్నో నుంచి హై స్పీడ్‌తో వస్తున్న డబుల్ డెక్కర్ బస్సు, ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు బస్సులోని ముగ్గురు మృతి చెందారు. తప్పుడు మార్గంలో వస్తోన్న కారును ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిిందని ఎస్పీ సంజయ్ కుమార్ వెల్లడించారు.

Details

కేసు నమోదు చేసిన పోలీసులు

నాగాలాండ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న బస్సు రాయ్ బరేలీ నుంచి దిల్లీ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారును ఢీకొట్టిన వెంటనే రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి బస్సు బోల్తాకొట్టింది. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.