
Medchal: మేడ్చల్ వద్ద ఘోర రైలు ప్రమాదం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్లు దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
మేడ్చల్ జిల్లా గౌడవెల్లి వద్ద ఘోర విషాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని తండ్రితో సహా ఇద్దరు కుమార్తెలు మృతి చెందాడు.
మృతులు రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. తండ్రి కృష్ణ రైల్వే లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
అయితే ఇవాళ ఆదివారం సెలవు దినం కావడంతో పిల్లలను వెంట తీసుకొని విధులకు హాజరయ్యాడు.
తండ్రి పిల్లలను ట్రాక్‌పై కూర్చొబెట్టి పనిచేస్తుండగా, ఇంతలోనే ట్రాక్‌పైకి ట్రైన్ వచ్చింది.
పిల్లలను కాపాడబోయే సమయంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు.
Details
కేసు నమోదు చేసుకున్న పోలీసులు
దీంతో రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తన భర్తతో సహా ఇద్దరు పిల్లలను పొగొట్టుకోవడంతో వారి తల్లి కన్నీరుమున్నీరుగా విలిపించింది.
ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.