Page Loader
వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. ఫేమస్ కబాబ్ రెస్టారెంట్‌‌ను మూసివేసిన ఎఫ్‌డీఏ 
వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. ఫేమస్ కబాబ్ రెస్టారెంట్‌‌ను మూసివేసిన ఎఫ్‌డీఏ

వంటగదిలో ఎలుకలు, బొద్దింకలు.. ఫేమస్ కబాబ్ రెస్టారెంట్‌‌ను మూసివేసిన ఎఫ్‌డీఏ 

వ్రాసిన వారు Stalin
Sep 14, 2023
12:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ ముంబైలోని పాపులర్ కబాబ్ రెస్టారెంట్ బడేమియాను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఎ) అధికారులు మూసివేశారు. రెస్టారెంట్ పరిశుభ్రతపై పలు ఫిర్యాదులు అందడంతో ఎఫ్‌డీఏ అధికారులు తనిఖీ చేశారు. అధికారుల తనిఖీ సమయంలో వంటగదిలో బొద్దింకలు, ఎలుకలు కనిపించాయి. అనంతరం రెస్టారెంట్ పత్రాలను పరిశీలించగా, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద దానికి లైసెన్స్ లేదని గుర్తించారు. బడేమియా రెస్టారెంట్ కబాబ్‌లకు చాలా ప్రసిద్ధి. దీనికి 76ఏళ్ల చరిత్ర ఉంది. ఇంత ఫేమస్ అయిన ఈ రెస్టారెంట్‌కు పత్రాలు లేకపోవడంపై ఎఫ్‌డీఏ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ రెస్టారెంట్‌కు రెండో బ్రాంచ్ బాంద్రాలో ఉంది. ఈ క్రమంలో బడేమియా కబాబ్ రెస్టారెంట్‌కు అధికారులు సీల్ వేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈ రెస్టారెంట్‌కు 76ఏళ్ల చరిత్ర