LOADING...
Puttaparthi: పుట్టపర్తి సమీపంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం.. 15న సీఎం శంకుస్థాపన!
15న సీఎం శంకుస్థాపన!

Puttaparthi: పుట్టపర్తి సమీపంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం.. 15న సీఎం శంకుస్థాపన!

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2026
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు, దానికి అనుబంధంగా ఏర్పడే పరిశ్రమల ద్వారా సుమారు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. గతంలో ముఖ్యమంత్రి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఆధునిక మధ్యస్థ యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఆధునిక మధ్యస్థ యుద్ధ విమానాలు సుమారు 140 ఇక్కడ తయారుకానున్నాయి.

వివరాలు 

ప్రాజెక్టును అమలు చేస్తున్న డీఆర్‌డీవో

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. విమానాలకు అవసరమైన వ్యవస్థల రూపకల్పన, పరీక్షలు, భాగాల సమీకరణ పనులను బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో పూర్తి చేయనున్నారు. అక్కడ తయారైన భాగాలను పుట్టపర్తికి తరలించి, ఇక్కడ తుది సమీకరణతో పాటు భూమిపై పరీక్షలను నిర్వహించనున్నారు.

వివరాలు 

డీఆర్‌డీవోకు 600 ఎకరాల భూమి

అలాగే విమాన పరీక్షా సముదాయం, శాస్త్రవేత్తల నివాస ప్రాంతాలు, తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం డీఆర్‌డీవోకు 600 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కేంద్రాన్ని ఏడీఏ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు అభివృద్ధి, తయారీ పనుల కోసం టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్ అండ్ టీ, భారత్ ఫోర్జ్ సంస్థల సహకారం తీసుకోవాలని యోచిస్తున్నారు. ప్రాజెక్టుకు అనుబంధంగా మరిన్ని యూనిట్లు ఏర్పాటుచేయడానికి సమీపంలో మరో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది.

Advertisement