
Telangana: తెలంగాణ గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాలు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో గ్రామ పంచాయతీలు,మండల పరిషత్,జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా (ఎంపీటీసీ,జడ్పీటీసీ) ఓటర్ల తుది జాబితాలు తయారయ్యాయి. ఈ నెల 2వ తేదీన వార్డులు,గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను అధికారులు ముద్రించారు. బుధవారం ఎంపీటీసీ, జడ్పీటీసీలకు సంబంధించి పూర్తి జాబితాను రూపొందించి, వెలువరించారు. అలాగే, ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను కూడా గుర్తించి, వాటి వివరాలను జాబితాలో చేర్చారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు, 1,12,534 వార్డులు, 5,763 ఎంపీటీసీ స్థానాలు, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
వివరాలు
రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల తుది జాబితా
ఈ క్రమంలో, రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల వారీగా రూపొందించిన ఓటర్ల తుది జాబితాలను పంచాయతీరాజ్ శాఖ బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించింది. బీసీ రిజర్వేషన్ల శాతం, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని ఎన్నికల సంఘానికి నివేదిస్తే అది ఎన్నికల నిర్వహణను చేపడుతుంది.