తదుపరి వార్తా కథనం

Hyderabad Metro: 70 కిలోమీటర్లలో హైదరాబాద్ మెట్రో విస్తరణ.. రూట్ మ్యాప్ ఖరారు
వ్రాసిన వారు
Stalin
Jan 23, 2024
10:50 am
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఫేజ్-2 విస్తరణ రూట్ మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు.
ఈ మేరకు ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.
హైదరాబాద్‌లో ఎక్కువ మందికి ప్రజలకు మెట్రో సేవలు అందుబాటులో ఉంచేలా 70 కిలోమీటర్లు విస్తరించేలా ఈ కొత్త ప్రతిపాదనలను తయారు చేశారు.
సిటీలోని నలుమూలాలకు ఎయిర్ పోర్ట్ కనెక్ట్ అయ్యేలా.. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ప్రయాణ సౌకర్యం చేరువయ్యేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు.
మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో దాదాపు 69కిలోమీటర్లు వరకు అందుబాటులో ఉంది.
ఈ మూడు కారిడార్లలో నిత్యం లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫేజ్-2 రూట్ మ్యాప్ సిద్ధం
మెట్రో ఫేజ్-2 రూట్ ఖరారు#Hyderabad #Metro #NTVNews #NTVTelugu pic.twitter.com/u0nGDcGdgO
— NTV Telugu (@NtvTeluguLive) January 22, 2024