విశాఖపట్టణం హార్బర్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. ప్రమాదంలో బూడిదైన 23 ఫిషింగ్ బోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణంలోని ఓ హార్బర్‌లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 23 మత్స్యకారుల బోట్లు బూడిదయ్యాయి.
ఈ ఘటనలో ₹ 30 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా.కొందరు ఆకతాయిలు పడవలకు నిప్పుపెట్టినట్లు మత్స్యకారులు అనుమానిస్తున్నారు.
ఇంధనాలు, డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిల్వలలు బోట్లలలో ఉండడంతో మంటలు మరింత వ్యాపించాయి.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తోంది. ఇంధన ట్యాంకుల్లో మంటలు చెలరేగడం వల్ల కొన్ని పడవల్లో పేలుళ్లు సంభవించడంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నారు.
Details
రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మంటలు
రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని సీనియర్ పోలీసు అధికారి ఆనంద రెడ్డి తెలిపారు.
పడవలపై ఉన్న సిలిండర్లు పేలుళ్లకు కారణమవుతుందన్న, ప్రజలు దూరంగా ఉండాలని కోరుతున్నామన్నారు.
మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం గల కారణాలు తెలియరాలేదని, ప్రాణ నష్టంపై ఇంకా స్పస్థత రాలేదని తెలిపారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.