Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ పట్నం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.
కోర్బా నుంచి విశాఖకు చేరుకున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో బీ6, బీ7, ఎం 1 ఏసీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ప్రమాద సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.
Details
షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు
ఏసీ బోగీల్లో షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగాయని అధికారులు అంచనా వేశారు.
రైలు ఉదయం ప్లాట్ ఫామ్ మీదికి వచ్చిన కొద్దిసేపటికే మంటలు వ్యాప్తించాయి. దీంతో మూడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. తొలుత బోగిల్లో దట్టమైన పోగ వ్యాప్తించింది.
ముందుగా ఏ1 బోగి నుంచి పొగలు గుర్తించారు. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే అలారం మోగించారు.
ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.