Page Loader
ఒడిశాలో మరో రైలు ప్రమాదం; సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు 

ఒడిశాలో మరో రైలు ప్రమాదం; సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు 

వ్రాసిన వారు Stalin
Jun 06, 2023
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలో మూడు రైళ్ల ఢీకొన్న పెను విషాదాన్ని మరువక ముందే మరో రైలు ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఒడిశాలోని బెర్హంపూర్ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. రైలులోని బీ-5 కోచ్‌లో మంటలు చెలరేగాయి. బెర్హంపూర్ రైల్వే స్టేషన్‌లో రైలు ఆగినప్పుడు ఏసీ కోచ్‌లో నుంచి పొగలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. వెంటనే ఈ విషయాన్ని అగ్నిమాపక సిబ్బందికి రైల్వే అధికారులు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. 45 నిమిషాల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు ఆర్పిన తర్వాత రైలు స్టేషన్‌ నుంచి బయలుదేరింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏసీ కోచ్‌లో చెలరేగిన మంటలు