Page Loader
Delhi: ద్వారకా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి తీవ్ర గాయాలు
ద్వారకా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి తీవ్ర గాయాలు

Delhi: ద్వారకా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి తీవ్ర గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 22, 2024
08:17 am

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి దిల్లీలోని ద్వారకలో బుధవారం ఓ అపార్ట్‌మెంట్‌లోని రెండు ఫ్లాట్లలో మంటలు చెలరేగడంతో 83 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందగా,ఆమె మనవరాలికి అనేక గాయాలు అయ్యాయి. మృతురాలు జసూరి దేవిగా, గాయపడిన వారిని 30 ఏళ్ల పూజా పంత్‌గా గుర్తించారు.ఫ్లాట్‌లో ఉన్న జసూరి దేవి, ఆమె మనవరాలు పూజ మంటల్లో చిక్కుకున్నారు, ఆ తర్వాత వారు నివాస భవనంలోని నాల్గవ అంతస్తు నుండి దూకారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సంఘటన గురించి సమాచారం అందుకున్ననాలుగు ఫైర్ టెండర్లు,అసిస్టెంట్ డివిజనల్ అధికారి ఉదయవీర్‌తో సహా 20 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 40 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు.

Details 

తలకు బలమైన గాయాలు అయ్యి వృద్ధురాలు మృతి 

సమీపంలోని వ్యక్తులు నేలపై పరుపులు పరిచారు. ఆ తర్వాత వృద్ధురాలు, ఆమె మనవరాలు దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, తలకు బలమైన గాయాలు కావడంతో వృద్ధురాలు చనిపోయిందని, ఆమె మనవరాలి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ద్వారకా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం