LOADING...
Delhi: దిల్లీలో అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం

Delhi: దిల్లీలో అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 25, 2026
09:07 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలోని లక్ష్మీ నగర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నివాస ప్రాంతంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిస్థితి విషమించింది. మంటలు వేగంగా వ్యాపించి సమీపంలోని నాలుగు భవనాలను చుట్టుముట్టి, మొత్తం 14 ఫ్లాట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న జె ఎక్స్‌టెన్షన్‌లోని రమేష్ పార్క్ ప్రాంతంలో జరిగింది. ట్రాన్స్‌ఫార్మర్‌లో చెలరేగిన మంటల నుంచి ఎగిసిన నిప్పురవ్వలు సమీప భవనాలకు వ్యాపించడంతో అగ్ని మరింత విస్తరించింది.

వివరాలు

మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది

తెల్లవారుజామున సుమారు 12:45 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మొత్తం 8 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీ ప్రమాదాన్ని నివారించడంలో అగ్నిమాపక సిబ్బంది కీలక పాత్ర పోషించారు.

Advertisement