LOADING...
ముంబై:ఏడు అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం..6 మంది మృతి
ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం..6 మంది మృతి

ముంబై:ఏడు అంతస్తుల భవనంలో ఘోర అగ్ని ప్రమాదం..6 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2023
10:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ముంబైలోని గోరేగావ్‌లోని ఓ భవనంలో శుక్రవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో కనీసం ఆరుగురు మరణించగా,మరో 40 మంది గాయపడ్డారు. వీళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉండగా..క్షతగాత్రుల్ని హెబీటీ, కూపర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగడంతో పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా దగ్ధమయ్యాయి. ఏడు అంతస్తుల భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు నివేదికలు తెలిపాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్కింగ్ ఏరియాలో గుడ్డకు మంటలు అంటుకోవడంతో మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం..6 మంది మృతి