
Tirumala: తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమలకు 3 కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని టీటీడీ అటవీ ప్రాంతంలో శుక్రవారం మంటలు చెలరేగాయి.
మంటలను గమనించిన టీటీడీ అటవీశాఖ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు.
డీఎఫ్‌ఓ,సిబ్బంది,అగ్నిమాపక సిబ్బంది,వాటర్ ట్యాంక్‌లతో ఘటనాస్థలికి వెళ్లి మంటలను ఆర్పారు.
అగ్నిప్రమాదంలో శ్రీ గంధం చెట్లతో సహా అనేక వృక్షాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదానికి గల దీనికి కారణం తెలియరాలేదు.
మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు పెరగడమే కారణమని అనుమానిస్తున్నారు.
అయితే ఈ మంటలకు సంబంధించిన వీడియోను ఓ భక్తుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. శేషాచలం అడవుల్లో మంటలు కనిపించిన దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు.
ఈ వీడియోలోని విజువల్స్ ప్రకారం గత రాత్రి నుంచే శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం
తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం..#Tirumala #Fire #Accident #NTVTelugu pic.twitter.com/oT0tGQXXoH
— NTV Telugu (@NtvTeluguLive) April 19, 2024