Delhi: దిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కాల్పుల కలకలం
దిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో బుధవారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. సబ్జీ మండి పోలీస్ స్టేషన్ ఏరియాలోని తీస్ హజారీ కోర్టులో ఈరోజు మధ్యాహ్నం 1:35 గంటల ప్రాంతంలో కాల్పుల ఘటన జరిగింది. రెండు వర్గాల న్యాయవాదుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వాదం కారణంగానే కాల్పుల ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి క్రైమ్ స్క్వాడ్‌ను పంపినట్లు చెప్పారు. కోర్టు ప్రాంగణంలో కాల్పుల ఘటనను ఖండిస్తూ, తుపాకీలకు లైసెన్స్ ఉందా లేదా అనే దానిపై దర్యాప్తు జరుపుతామని బార్ కౌన్సిల్ ఆఫ్ దిల్లీ ఛైర్మన్ కెకె మనన్ ప్రకటించారు.