LOADING...
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరదనీటి ప్రవాహం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరదనీటి ప్రవాహం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2025
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గంటల వ్యవధిలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో,దిగువ ప్రాంత ప్రజలకు అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి వరద ఉధృతి మరింత పెరగడంతో,ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం నదిలో 3.91 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. సాయంత్రానికి లేదా రేపు ఉదయం నాటికి ఈ ప్రవాహం 6 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 69 గేట్లు పైకెత్తి, వచ్చిన నీటిని వెంటనే దిగువకు వదులుతున్నారు. మరోవైపు, మహిళలు ఘాట్ల వద్ద నదికి పూజలు చేసి, 'శాంతించు కృష్ణమ్మా' అంటూ హారతులు ఇస్తున్నారు.

వివరాలు 

 భయభ్రాంతులకు గురవుతున్నబెజవాడవాసులు

భారీగా వరద నీరు పెరుగుతుండటంతో, బెజవాడ ప్రజల్లో భయం అలుముకుంది. ముఖ్యంగా గత సంవత్సరం కురిసిన భారీవర్షాల కారణంగా బుడమేరు వాగు కట్ట తెగిపోవడంతో, అనేక కుటుంబాలు నష్టపోయిన జ్ఞాపకాలు ఇంకా ప్రజలను వెంటాడుతున్నాయి. అప్పుడు వరద నీరు తగ్గాక ఇళ్లకు చేరుకున్న వారు, గదులన్నీ బురదతో నిండిపోయి కనిపించడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతేకాక, ఆ విపత్తులో కొందరు ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు ఇప్పటికీ బెజవాడవాసుల కళ్లముందే తారసపడుతున్నాయి. అందువల్ల ఈసారి అధికారులు జారీ చేసిన వరద హెచ్చరికలు వారిని మళ్లీ ఆందోళనలోకి నెట్టాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రకాశం బ్యారేజి వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ