Page Loader
Murder: కోల్‌కతాలో పీజీ వైద్య విద్యార్థిని దారుణ హత్య.. స్పందించిన మమతా బెనర్జీ
కోల్‌కతాలో పీజీ వైద్య విద్యార్థిని దారుణ హత్య.. స్సందించిన మమతా బెనర్జీ

Murder: కోల్‌కతాలో పీజీ వైద్య విద్యార్థిని దారుణ హత్య.. స్పందించిన మమతా బెనర్జీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2024
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, ఆ తర్వాత దారుణంగా హత్య చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ రాయ్ అనే తాత్కాలిక ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగాల్ ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బాధితురాలి కడుపు, ఎడుమ కాలు, మెడ, కుడి చెయి, పెదవులపై గాయాలను అధికారులు గుర్తించారు.

details

నిందితులను ఉరి తీస్తాం : సీఎం

ఈ అత్యాచార ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. అవసరమైతే నిందితులకు ఉరితీస్తామని పేర్కొన్నారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, ఈ కేసును వేగంగా ఛేదించాలని ఆదేశించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు బీజేపీ నేతలు బెంగాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.