Page Loader
Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి 
Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి

Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2024
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు పౌరులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారని పోలీసులు గురువారం తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్‌తౌఖోంగ్ ఖా ఖునౌలో నలుగురు పౌరులు, కాంగ్‌పోక్పి జిల్లా కాంగ్‌చుప్ చింగ్‌ఖాంగ్‌లో ఒకరు గుర్తుతెలియని సాయుధ దుండగులచే చంపబడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలో నలుగురు పౌరులను చంపిన హంతకులను పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. మృతులను ఓయినమ్ బమోంజావో సింగ్ (61),అతని కుమారుడు ఓయినమ్ మణితోంబ సింగ్ (32), తియం సోమేంద్ర సింగ్ (55),నింగ్‌థౌజం నబద్వీప్ సింగ్(40)గా గుర్తించారు.

Details 

బంకర్ హిల్స్ నుండి మనోరంజన్ మృతదేహం స్వాధీనం

కాంగ్‌పోక్పిలో మరణించిన పౌరుడిని థియం కొంజిన్‌కు చెందిన తఖెల్లంబమ్ మనోరంజన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,కంగ్‌చుప్ చింగ్‌ఖాంగ్ సమీపంలోని బంకర్ హిల్స్ నుండి మనోరంజన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధ, గురువారాల మధ్య రాత్రి సాయుధ దుండగుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం రాత్రి, తౌబాల్ జిల్లాలోని ఖంగాబోక్ వద్ద ఒక సమూహం వారిపై కాల్పులు జరపడంతో ముగ్గురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి.