Page Loader
Kashmir: హిజ్బుల్‌ కమాండర్‌ ఇంటిపై ఎన్ఐఏ దాడులు.. 5 చోట్ల ఏకకాలంలో దాడులు
హిజ్బుల్‌ కమాండర్‌ ఇంటిపై ఎన్ఐఏ దాడులు

Kashmir: హిజ్బుల్‌ కమాండర్‌ ఇంటిపై ఎన్ఐఏ దాడులు.. 5 చోట్ల ఏకకాలంలో దాడులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2023
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

కాశ్మీర్‌లోని ఉగ్ర నాయకుడి ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలను నిర్వహించింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ ఒమర్ ఘనీపై ఉగ్రకార్యకలాపాలకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. కుల్గామ్ లోని అతడి ఇంటితో పాటు ఐదు చోట్ల ఎన్ఐఏ అధికారులు దాడులు చేపట్టినట్లు తెలిసింది. ఈ దాడుల్లో ఎన్ఐఏ అధికారులతో పాటు సీఆర్పీఎఫ్ దళాలు కూడా ఉన్నాయి. గతంలో షోపియాన్, పుల్వామా, కుల్గామ్ లో దాడులు నిర్వహించిన విసయం తెలిసిందే. కాశ్మీర్ లోని హిజ్బుల్, జైషే, లష్కరే సంస్థలకు నిధులు వెళుతున్నాయని ఎన్ఏఐ భావిస్తోంది. కొంతకాలంగా ది రెసిస్టెంట్‌ ఫ్రంట్‌, ముజాహిద్దీన్‌ గజ్వా ఉల్‌ హింద్‌, కశ్మీర్‌ టైగర్స్‌, జమ్మూకశ్మీర్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ వంటి సంస్థలపై జాతీయ దర్యాప్తు సంస్థ దృష్టి సారించింది.

Details

అదృశ్యమైన జవాన్‌ జాడను గుర్తించిన కుల్గాం పోలీసులు

రెండు రోజుల క్రితం శ్రీనగర్, బుద్గామ్, కుప్వారా, పుల్వామాలోని పలు ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎన్జీవో జేకేసీసీఎస్ కార్యాలయాల్లో సోదాలు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ సమన్వయ కర్త ఖుర్రం పర్వేజ్ ను అరెస్టు చేశారు. గత నెల 29న అదృశ్యమైన ఆర్మీ జవాన్ జావెద్ అహ్మద్ జాడను కుల్గాం పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని నిన్న రాత్రి కాశ్మీర్ జోన్ పోలీస్ ట్విట్టర్ లో పేర్కొంది. జావెద్ ను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. అతడి అదృశ్యం వెనుక ఉన్న కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.