LOADING...
Uttar Pradesh: బాగ్‌పత్‌లో లడ్డూ వేదిక కూలడంతో ఐదుగురు మృతి.. 50మందికి పైగా గాయాలు
బాగ్‌పత్‌లో లడ్డూ వేదిక కూలడంతో ఐదుగురు మృతి.. 50మందికి పైగా గాయాలు

Uttar Pradesh: బాగ్‌పత్‌లో లడ్డూ వేదిక కూలడంతో ఐదుగురు మృతి.. 50మందికి పైగా గాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదినాథుడి లడ్డూ వేడుకలో అనుకోకుండా అపశృతి చోటు చేసుకుంది. లడ్డూ వేదిక కుప్పకూలడంతో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. భక్తులు లడ్డూకోసం పెద్ద ఎత్తున పోటీ పడిన కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి, మెరుగైన వైద్యం అందించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఘటన అనంతరం దృశ్యాలు