Prakasam barrage: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి, 70 గేట్లు ఎత్తివేత
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ఈ పరిస్థితిని అంచనా వేసిన అధికారులు, మొత్తం 70 గేట్లు ఎత్తి 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అదనంగా, బ్యారేజీ నుంచి కాల్వలకు 3,507 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. దుర్గగుడి పైవంతెనను కూడా అప్రమత్తంగా తాత్కాలికంగా మూసివేశారు.