తదుపరి వార్తా కథనం

Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 04, 2025
03:43 pm
ఈ వార్తాకథనం ఏంటి
నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టులోకి జూరాల నుంచి భారీగా నీటి ప్రవాహం వస్తోంది. ప్రస్తుతానికి జూరాల నుంచి 76,841 క్యూసెక్కుల నీరు శ్రీశైలంకు చేరుతున్నదిగా సమాచారం. ఈ ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని,అధికారులు 67,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దృష్టిలోకి తీసుకుంటే, ఎడమ గట్టు విద్యుత్కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా,కుడి గట్టు విద్యుత్కేంద్రం నుంచి 32,003 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 875.9 అడుగుల వద్ద ఉంది. అలాగే, శ్రీశైలం జలాశయ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 167.8 టీఎంసీల నీరు నిల్వగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.