తదుపరి వార్తా కథనం
Yanam: ఫల-పుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా పూల నెమళ్లు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 07, 2026
11:34 am
ఈ వార్తాకథనం ఏంటి
శ్వేత, గులాబీ రంగుల్లో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల నెమళ్లు యానాంలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పట్టణంలో నిర్వహిస్తున్న ఫలాలు, పుష్పాలు, కూరగాయల ప్రదర్శనలో ఈ ప్రత్యేక అమరికలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో చెన్నైకు చెందిన ఫ్లవరిస్ట్ కార్తీక్ గులాబీలు, బంతులు, చామంతులు తదితర పుష్పాలను వినియోగించి వివిధ ఆకృతుల్లో రూపొందించిన అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కార్యక్రమాలను పుదుచ్చేరి వ్యవసాయశాఖ మంత్రి సి. జయకుమార్ మంగళవారం ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
యానాం లో పర్యావరణ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇండోర్ ఇంటర్నేషనల్ స్టేడియం యానాం లో పర్యావరణ ప్రేమికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో 💙💙 pic.twitter.com/E4Y5rtu0HY
— bhaskar reddy (@chicagobachi) January 7, 2026