Delhi Air Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం, పొగమంచు ..హెచ్చరికలు జారీ
దేశ రాజధాని దిల్లీకి ప్రస్తుతం తీవ్ర కాలుష్యం,పొగమంచు కమ్మేసింది. దీనితో అక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. ప్రస్తుతం విజిబులిటీ 500 మీటర్లకు తగ్గిపోయింది.వాహనాల కాలుష్యం, పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీ ఒక గ్యాస్ చాంబర్‌లా మారిపోయింది. ఈ కాలుష్యం వల్ల ఢిల్లీని గ్రాఫ్-4 చర్యలతో కట్టడించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆధారంగా ఢిల్లీలో గాలి నాణ్యత 448 పాయింట్లుగా నమోదైంది. ఇది తీవ్రమైన కాలుష్యాన్ని సూచిస్తుంది. చలి తీవ్రత పెరిగిన కొద్దీ, పొగమంచు,వాహన కాలుష్యం కూడా పెరిగాయి, దాంతో ఢిల్లీ వాసులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు బయటకు వెళ్ళకుండా ఉండాలని కాలుష్య నియంత్రణ మండలి సూచించింది.
ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత
ఇక, గురువారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అక్షర్‌ధామ్ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరుకోవడంతో, అక్కడ దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా వాహనదారులు గోచరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత పెరిగి ప్రజలు తీవ్ర పట్ల వణికిపోతున్నారు.