
ఫార్మా కంపెనీలకు కొత్త ప్రమాణాలను నిర్దేశించిన కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
Centre sets new standards for pharma firms: భారతదేశంలోని ఫార్మాస్యూటికల్ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
2022 నుంచి భారతదేశంలో తయారైన మందులను వినియోగించి విదేశాల్లో పలువురు మరణించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్తగా జారీ చేసిన ప్రమాణాలు ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది.
కొత్త నియమాలను అనుసరించి కంపెనీలు ఔషధాలను తయారు చేయాల్సి ఉంటుంది.
కొత్త మార్గదర్శకాల్లో ఔషధాల నాణ్యత, లేబులింగ్, టెస్టింగ్, లైసెన్సింగ్ వంటి అనేక అంశాలు ఉన్నాయి.
కేంద్రం
కొత్త మార్గదర్శకాలు ఇవే
ఔషధాల తయారీదారులు తమ ఉత్పత్తుల నాణ్యతకు బాధ్యత వహించాలని ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
భద్రత లేదా నాణ్యత లోపించి, తమ ఔషధాలు వల్ల ఎవరి ప్రాణాలకు హాని కలిగించకుండా చూసుకోవడం కంపెనీలదే అని కేంద్రం నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
నాణ్యత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉత్పత్తిపై లేబుల్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
నిబంధనల ప్రకారం, ఔషధ కంపెనీలు ఔషధం ఏదైనా రీకాల్ గురించి లైసెన్సింగ్ అధికారికి తెలియజేయాల్సి ఉంటుంది.
కంపెనీలు ఔషధాల రీ-టెస్టింగ్ లేదా బ్యాచ్ వెరిఫికేషన్ కోసం తగిన సంఖ్యలో నమూనాలను పరీక్షించుకోవాలి.
కేంద్రం
కొత్త ప్రమాణాలను అమలు చేయడానికి 6 నెలల గడువు
కొత్త ప్రమాణాలను అమలు చేయడానికి ప్రభుత్వం పెద్ద కంపెనీలకు గరిష్టంగా 6 నెలలు, చిన్న కంపెనీలకు ఒక సంవత్సరం వరకు గడువు ఇచ్చింది.
ఈ గడువును పొడిగించాలని చాలా కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ప్రమాణాల వల్ల సగానికిపైగా కంపెనీలు మూతపడాల్సి వస్తుందని యాజమాన్యాలు చెబుతున్నాయి.
2022 అక్టోబర్‌లో ఆఫ్రికన్ దేశం గాంబియాలో 66మంది పిల్లలు మరణించిన తర్వాత, ఒక భారతీయ కంపెనీ తయారు చేసిన 4ఔషధాల గురించి WHO హెచ్చరిక జారీ చేసింది.
డిసెంబర్ 2022లో, భారతదేశంలో తయారైన సిరప్ తాగి 18 మంది పిల్లలు చనిపోయారని ఉజ్బెకిస్తాన్ పేర్కొంది.
ఈ కేసులో కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేయడంతో పాటు కంపెనీ లైసెన్స్‌ను కూడా రద్దు చేశారు.