Kerala: కేరళలో ఫుట్‌బాల్ ఆటగాడిపై దాడి.. కేసు నమోదు
కేరళలోని మలప్పురం జిల్లాలో జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఐవరీ కోస్ట్‌కు చెందిన దైర్రాసౌబా హస్సేన్ జూనియర్ అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడిపై ప్రేక్షకులు దాడి చేసి చితకబాదారు. దాడి తరువాత, హస్సేన్ జూనియర్ మలప్పురం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)కి ఫిర్యాదు చేశాడు. సాక్ష్యం కోసం వీడియో ఫుటేజీని సమర్పించారు. ఫిర్యాదు ప్రకారం, మ్యాచ్‌లో ప్రేక్షకులు హస్సేన్ పై జాతి దూషణలు చెయ్యడమే కాకుండా, రాళ్లు కూడా రువ్వారు. మైదానం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా, మైదానంలోని పలు ప్రాంతాల్లో ప్రేక్షకులు హస్సేన్ ను వెంబడించి దాడి చేశారు. మలప్పురం పోలీస్ చీఫ్ ఆదేశాల మేరకు ఫిర్యాదు ప్రస్తుతం అరీకోడ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) విచారణలో ఉంది.