తదుపరి వార్తా కథనం

Vanajeevi Ramaiah: వన ప్రేమికుడు వనజీవి రామయ్య కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 12, 2025
09:00 am
ఈ వార్తాకథనం ఏంటి
పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య (85) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.
మొక్కల పట్ల అపారమైన ప్రేమ కలిగిన రామయ్య, తన ఇంటిపేరునే 'వనజీవి'గా మార్చుకున్నారు.
జీవితాంతం పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడి, లక్షల సంఖ్యలో మొక్కలు నాటడం ద్వారా అనేకమందికి ప్రేరణగా నిలిచారు.
ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి ఆయన స్వగ్రామం. కోటికి పైగా మొక్కలు నాటి ఓ సరికొత్త చరిత్రను సృష్టించిన రామయ్యకు 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.