Page Loader
Jagdish Singh Khehar : సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ ఖేహర్‌ సేవలకు పద్మ విభూషణ్ 
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ ఖేహర్‌ సేవలకు పద్మ విభూషణ్

Jagdish Singh Khehar : సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ ఖేహర్‌ సేవలకు పద్మ విభూషణ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్‌కు పద్మ విభూషణ్‌ ప్రకటించారు. 2011 సెప్టెంబర్ 13 నుంచి 2017 ఆగస్టు 27 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆయన సేవలందించిన విషయం తెలిసిందే. 2017 జనవరి 4 నుంచి ఆగస్టు 27 వరకు 44వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి ప్రస్తుత కొలీజియం వ్యవస్థనే సరైందని ఆయన పేర్కొన్నారు.

Details

99వ రాజ్యాంగ సవరణ విరుద్ధమని ప్రకటించిన జగదీశ్ ఖేహర్‌

నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్‌ అవసరం లేదని తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి జస్టిస్ ఖేహర్ నేతృత్వం వహించారు. 99వ రాజ్యాంగ సవరణను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించారు. వ్యక్తిగత గోప్యత హక్కు ఆర్టికల్ 14, 19, 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ తీర్పునిచ్చిన తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఖేహర్ కూడా భాగస్వామిగా ఉన్నారు. 2జీ కేసులో సహజ వనరులను వేలం ద్వారానే కేటాయించాలని తీర్పునిచ్చి, సహజ వనరుల నుంచి ప్రజలకు లబ్ధి చేకూరాల్సిందేనని స్పష్టం చేశారు.

Details

తలాక్ ను సమర్థిస్తూ తీర్పు

ముమ్మారు తలాక్‌ను 3:2 మెజారిటీతో రద్దు చేసిన తీర్పులో, జస్టిస్ ఖేహర్ మైనారిటీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. 2017లో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముమ్మారు తలాక్‌ను వ్యతిరేకించినా ఆయన ఆ విధానాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చారు. ఎండో సల్ఫాన్‌ ప్రభావంతో మృతి చెందిన 5,000 మంది బాధిత కుటుంబాలకు 3 నెలల్లో రూ.500 కోట్ల పరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించి, దీన్నీ అమలు కూడా చేయించారు. దీంతో ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది.