Atlas Cycle : తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న 'అట్లాస్ సైకిల్' మాజీ చీఫ్ సలీల్ కపూర్
ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ 'అట్లాస్' మాజీ ప్రెసిడెంట్ సలీల్ కపూర్(70) ఆత్మహత్య చేసుకున్నాడు. దిల్లీలోని ఆయన నివాసంలో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు 'సూసైడ్ నోట్' ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగా కొంతమంది తనను వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ సూసైడ్‌లో పేర్కొన్నారు. ఇక రూ.9 కోట్లకు సంబంధించి 2015లో దిల్లీ పోలీసులు సలీల్ కపూర్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన కుటుంబ సభ్యురాలు నటాషా కపూర్ కూడా 2020లో అదే నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. నిధుల లేమీ కారణంగా 2020లో అట్లాస్ కంపెనీ మూత పడింది.