Loading...
Alla Nani: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

Alla Nani: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 15, 2026
02:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) కన్నుమూశారు. మంగళవారం విశాఖపట్టణంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది. ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌ పార్టీతో ప్రారంభమైంది. ఏలూరు నియోజకవర్గం నుంచి తొలిసారిగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వివరాలు 

జగన్‌ హయాంలో కీలక బాధ్యతలు

వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఆళ్ల నాని ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగారు.

రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆళ్ల నాని కొద్ది నెలల క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు.

తాజాగా ఆయన మృతిచెందడంతో రాజకీయ నాయకులు, అనుచరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

ADVERTISEMENT