LOADING...
Azharuddin: తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం
తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

Azharuddin: తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
12:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ కొత్త మంత్రిగా మహ్మద్‌ అజారుద్దీన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కేబినెట్‌ మంత్రులు తదితరులు పాల్గొన్నారు. అజారుద్దీన్‌ 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్‌లో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. అనంతరం నిజాం కాలేజీలో బీకాం పట్టా సాధించారు. ఆయన మేనమామ జైనులాబుద్దీన్‌ ప్రేరణతో క్రికెట్‌ వైపు మళ్లి, 1984లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. మొదటి మూడు టెస్టుల్లోనే వరుస సెంచరీలతో సరికొత్త రికార్డులు సృష్టించి సంచలనం రేపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్

వివరాలు 

ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయ రంగంలో..

1989లో భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌, 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత రాజకీయ రంగంలో అడుగుపెట్టారు. 2009 ఫిబ్రవరి 19న కాంగ్రెస్‌ పార్టీలో చేరి, అదే సంవత్సరం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 2018లో తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.