NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి  
    తదుపరి వార్తా కథనం
    నేడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి  
    కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న మాజీ మంత్రి జూపల్లి

    నేడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి  

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 02, 2023
    01:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ మేరకు రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ఎన్నికలకు కసరత్తులు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

    ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి, వనపర్తి ఎంపీపీ మేఘారెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, కంటోన్మెంట్ శ్రీవర్ధన్ తదితరులు బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం గూటికి చేరనున్నారు.

    జిల్లాలోని కొల్లాపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలనుకున్నారు. సభకు ప్రియాంక గాంధీని ముఖ్య అతిథిగా రప్పించేందుకు ప్లాన్ రెఢీ చేశారు. వర్షాల కారణంగా రెండు సార్లు ఆమె టూర్ వాయిదా పడింది.

    DETAILS

    దిల్లీలో జూపల్లి వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

    దేశ రాజధాని దిల్లీ వేదికగా బుధవారం జూపల్లి సహా ఇతరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇందుకోసం మంగళవారం సాయంత్రమే జూపల్లితో పాటు మరికొందరు నేతలు, అనుచరులు హస్తినా బాట పట్టారు.

    దిల్లీలో జూపల్లి వెంట టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి కూడా ఉన్నారు.

    మరోవైపు సీనియర్‌ నేత జగదీశ్వర్‌రావుకు కొల్లాపూర్ టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోంది. ఏప్రిల్ 11న కొల్లాపూర్‌లో ర్యాలీ నిర్వహించిన జగదీశ్వర్‌రావు తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో మల్లు రవి, నాగం పాల్గొన్నారు.

    జగదీశ్వర్‌ రావుకే టిక్కెట్‌ ఇవ్వాలని స్థానిక కార్యకర్తలు కోరుతున్నారు.ఈ అంశాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాలని మల్లు రవికి నాగం విజ్ఞప్తి చేశారు. గెలుపే లక్ష్యంగా టిక్కెట్లు కేటాయిస్తామని మల్లు రవి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    దిల్లీ
    జూపల్లి కృష్ణారావు
    తెలంగాణ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్

    పాట్నలో ప్రతిపక్ష నేతల సమావేశం; ఏకాభిప్రాయం కుదిరేనా? పాట్న
    'Bharat Jodo' vs 'Bharat Todo': కాంగ్రెస్, బీజేపీ మధ్య సైద్ధాంతిక యుద్ధం: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    పొంగులేటి, జూపల్లి సహా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
    కేసీఆర్‌ను గద్దె దించేందుకే కాంగ్రెస్‌లోకి.. పొంగులేటి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

    దిల్లీ

    Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి  బస్సు ప్రమాదం
    'బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను లైంగికంగా వేధించారు', ఛార్జిషీట్‌లో దిల్లీ పోలీసులు రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్ ఇండియా
    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం  భారీ వర్షాలు
    Delhi: దిల్లీలో ఐదు ముక్కలుగా నరికిన మహిళ మృతదేహం లభ్యం  హత్య

    జూపల్లి కృష్ణారావు

    నేడు ఖమ్మం సభకు రాహుల్ గాంధీ; కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం  ఖమ్మం

    తెలంగాణ

    తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ భారీ వర్షాలు
    తెలంగాణలో ఎమ్మెల్యేలపై భారీగా క్రిమినల్​ కేసులు.. 61శాతం మందికి నేరచరిత్ర ఎమ్మెల్యే
    IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక  ఐఎండీ
    తెలంగాణలో 5 రోజులు దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025