తదుపరి వార్తా కథనం

David Raju : మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 25, 2024
09:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు(66) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు.
1999లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నుంచి ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో ఓడిన ఆయన 2010లో వైసీపీలో చేరారు.
తర్వాత 2014లో వైసీపీ తరుఫున పోటీచేసి యర్రగొండపాలెం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత రెండేళ్లకే టీడీపీలో చేరారు.
పార్టీలో గొడవలతో మళ్లీ వైసీపీలో చేరినా క్రియాశీలకంగా పనిచేయలేదు.
ఇక డేవిడ్ రాజు మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైస్ జగన్మోహాన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
మీరు పూర్తి చేశారు