LOADING...
Guvvala Balaraju: బీఆర్ఎస్‌కు గువ్వల బాలరాజు గుడ్‌బై… కీలకంగా మారిన రాజీనామా లేఖ! 
బీఆర్ఎస్‌కు గువ్వల బాలరాజు గుడ్‌బై… కీలకంగా మారిన రాజీనామా లేఖ!

Guvvala Balaraju: బీఆర్ఎస్‌కు గువ్వల బాలరాజు గుడ్‌బై… కీలకంగా మారిన రాజీనామా లేఖ! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
06:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పెద్ద షాక్ ఇచ్చారు.ఆయన పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పంపారు.ఆ లేఖలో బాలరాజు కొన్ని కీలకమైన విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం తేలికగా తీసుకున్నది కాదని, చాలాకాలం ఆలోచించి, అనేక అంశాలను పరిశీలించిన తర్వాత తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. గత రెండు దశాబ్దాలుగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆ కాలంలో అనేక విషయాలు తెలుసుకున్నానని,నేర్చుకున్నానని తెలిపారు. తాను ఈ స్థాయికి చేరుకోవడంలో కేసీఆర్ పాత్ర కీలకమని ప్రశంసించారు. ఈ తరుణంలో పార్టీ నుంచి వెళ్లిపోవడం బాధకరమని భావిస్తున్నట్లు చెప్పారు.అయినా భవిష్యత్తు కోసం తప్పడం లేదని లేఖలో తెలిపారు.

వివరాలు 

 ఈ నెల 10న బీజేపీలోకి.. రో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా 

ఇదిలా ఉంటే, గువ్వల బాలరాజు త్వరలోనే బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ నెల 10న బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత రాజకీయ ప్రస్థానానికి వెళితే,2009లో నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన గువ్వల,కాంగ్రెస్ అభ్యర్థి మంద జగన్నాథం చేతిలో ఓటమి చెందారు. అనంతరం 2014లో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్‌కి చెందిన వంశీకృష్ణపై భారీ మెజార్టీతో గెలుపొందారు. 2018లో మళ్లీ విజయం సాధించారు.2022లో ఆయనకు నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. కానీ 2023 అసెంబ్లీఎన్నికల్లో వంశీకృష్ణ చేతిలో ఓటమిపాలయ్యారు.ఈపరిణామాల నేపథ్యంలో గువ్వల బీజేపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

 కాంగ్రెస్‌లో చేరిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

ఇక మరోవైపు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీనిపై బీఆర్ఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, స్పీకర్ ఆ ముగ్గురిపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉంది. ఇదే సమయంలో, అనేక మంది కీలక నేతలు ఇతర పార్టీల్లోకి మారిపోతుండటం గమనార్హం. ఇప్పుడు గువ్వల బాలరాజు కూడా ఆ జాబితాలో చేరారు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో స్పందిస్తూ—పార్టీని వదిలి వెళ్లినవారి వల్ల నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో గువ్వల రాజీనామాపై ఆయన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.