LOADING...
Kusuma Krishnamurthy: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత
మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత

Kusuma Krishnamurthy: మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూత

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2025
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు అధికారికంగా వెల్లడించారు. కుసుమ కృష్ణమూర్తి మరణవార్త తెలియగానే రాజకీయ, సామాజిక వర్గాల్లో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. 1940 సెప్టెంబర్‌ 11న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న అయినవిల్లి మండలం విలస గ్రామంలో కుసుమ కృష్ణమూర్తి జన్మించారు.

Details

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం

కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఆయన, ఆ పార్టీ లో వివిధ కీలక పదవుల్లో పనిచేశారు. తదనంతరం అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కుసుమ కృష్ణమూర్తి, మూడుసార్లు ఎంపీగా విజయం సాధించి పార్లమెంటేరియన్‌గా సేవలందించారు.

Advertisement