Page Loader
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్థికలు యమునా నదిలో నిమజ్జనం
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్థికలు యమునా నదిలో నిమజ్జనం

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్థికలు యమునా నదిలో నిమజ్జనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2024
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అస్థికలను ఆదివారం యమునా నదిలో నిమజ్జనం చేశారు. శనివారం దిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించగా, ఆదివారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులు ఘాట్‌లో నుంచి అస్థికలను సేకరించారు. అనంతరం సిక్కు సంప్రదాయం ప్రకారం యమునా నది సమీపంలోని 'మజ్ను కా తిలా' గురుద్వారా వద్ద నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మన్మోహన్‌ సింగ్‌ సతీమణి గురుశరణ్‌ కౌర్‌, కుమార్తెలు ఉపిందర్‌ సింగ్‌, దమన్‌ సింగ్‌, అమృత్‌ సింగ్‌తో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Details

డిసెంబర్ 26న మన్మోహన్ సింగ్ మరణం

జనవరి 1న దిల్లీలోని మోతీలాల్‌ నెహ్రూ మార్గ్‌లోని ఆయన అధికారిక నివాసంలో అఖండ్‌ పథ్‌ నిర్వహించనున్నారు. జనవరి 3న పార్లమెంటు కాంప్లెక్స్‌ సమీపంలోని రకాబ్‌ గంజ్‌ గురుద్వారాలో భోగ్‌ వేడుక, అంతిమ్‌ అర్దాస్‌, కీర్తన్‌ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మన్మోహన్‌ సింగ్‌ డిసెంబర్‌ 26న రాత్రి వయో సంబంధిత సమస్యలతో ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.