తదుపరి వార్తా కథనం

Train Accident : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన సూపర్‌ఫాస్ట్ రైలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Mar 18, 2024
08:14 am
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అజ్మీర్ లోని మదార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్ రైలు ఇంజిన్‌తో సహా నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయని అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును ట్రాక్ పైకి తీసుకురావడానికి చర్యలు ప్రారంభించారు.
ఈ ఘటన అర్థరాత్రి 1:00 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సబర్మతి-ఆగ్రా సూపర్‌ఫాస్ట్ రైలుకి ప్రమాదం
JUST IN | Four coaches of Sabarmati-Agra superfast train derail in Rajasthan's Ajmer : Agencies pic.twitter.com/OcQCFfdoeJ
— ET NOW (@ETNOWlive) March 18, 2024