
Delhi: ఢిల్లీ ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో మంగళవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీలోని నాలుగు ఆసుపత్రులకు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఢిల్లీలోని దీప్ చంద్ బంధు హాస్పిటల్, GTB హాస్పిటల్, దాదా దేవ్ హాస్పిటల్, హెడ్గేవార్ హాస్పిటల్స్ కి ఈ-మెయిల్‌ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపింది.
ఇదిలా ఉండగా, బెదిరింపు మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందని కనుగొనడానికి ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆదివారం కూడా పది హాస్పిటల్స్, ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ రాగా.. తనిఖీ చేసిన ఢిల్లీ పోలీసులు వాటిని నకిలీ బాంబు బెదిరింపులుగా తేల్చారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నాలుగు ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు
STORY | Four hospitals in Delhi receive bomb threat mail
— Press Trust of India (@PTI_News) May 14, 2024
READ: https://t.co/okRVFD0z4j pic.twitter.com/H915MJ9Ffg