NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Tragedy: యుపిలో దారుణం.. చెట్టు కింద నిద్రిస్తున్న 4గురిపైకి మృత్యు శకటం
    తదుపరి వార్తా కథనం
    Tragedy: యుపిలో దారుణం.. చెట్టు కింద నిద్రిస్తున్న 4గురిపైకి మృత్యు శకటం
    యుపిలో దారుణం.. చెట్టు కింద నిద్రిస్తున్న 4గురిపైకి మృత్యు శకటం

    Tragedy: యుపిలో దారుణం.. చెట్టు కింద నిద్రిస్తున్న 4గురిపైకి మృత్యు శకటం

    వ్రాసిన వారు Stalin
    Jun 02, 2024
    09:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ బుదౌన్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వారిపైకి వ్యాన్ మృత్యువులా పైకి వచ్చింది.

    దీంతో.. నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రోజు జరిగింది.

    ఈ ఘటనపై గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

    కాగా.. ప్రమాదానికి పాల్పడిన వ్యాన్ డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

    మృతులు.. బుదౌన్ జిల్లాకు చెందిన ప్రకాష్ (42), బ్రజ్‌పాల్ (35), ధనపాల్ (55), జ్ఞాన్ సింగ్ (40)గా గుర్తించారు.

    Details 

    స్థానికులు,మృతుల కుటుంబ సభ్యులు ఆందోళన

    వివరాల్లోకి వెళ్తే.. "జిల్లాలోని పైగామ్ భికంపూర్ గ్రామంలో ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంతలో ఓ వ్యాన్ అదుపు తప్పి వారిపైకి దూసుకెళ్లింది.ఈ ఘటనలో నలుగురు చనిపోయారు.. మరో ఇద్దరు గాయపడ్డారని.. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మేజిస్ట్రేట్ మనోజ్ కుమార్ చెప్పారు.

    ఈ ఘటనపై స్థానికులు,మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.వ్యాన్ డ్రైవర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లకుండా పోలీసులను అడ్డుకున్నారు.

    నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చామని మేజిస్ట్రేట్ తెలిపారు.

    శనివారం సాయంత్రం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు పోలీసు సూపరింటెండెంట్ అలోక్ ప్రియదర్శి తెలిపారు.

    శాంతిభద్రతల పరిరక్షణ కోసం గ్రామంలో పోలీసు సిబ్బందిని మోహరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Jayam Ravi : విడాకుల కేసులో కొత్త మలుపు.. రూ.40 లక్షలు భరణం కోరిన జయం రవి భార్య టాలీవుడ్
    Kailash Manasarovar Yatra: ఐదు సంవత్సరాల విరామం అనంతరం.. 720 మందితో మళ్లీ ప్రారంభం కానున్న కైలాస మానస సరోవర యాత్ర  ఉత్తరాఖండ్
    Hyderabad Rains: తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ వాతావరణ శాఖ
    MI vs DC Predicted Playing XI: ప్లేఆఫ్స్ కోసం డూ ఆర్ డై పోరు.. ముంబై-ఢిల్లీ జట్లలో కీలక మార్పులు ముంబయి ఇండియన్స్

    ఉత్తర్‌ప్రదేశ్

    Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ సమన్లు  అఖిలేష్ యాదవ్
    Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌ లో భారీ అగ్నిప్రమాదం.. రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ స్టేషన్‌లో ఘటన  అగ్నిప్రమాదం
    Uttarpradesh: స్నేహితుల చేతిలో కాలేజీ విద్యార్థి హత్య.. గొయ్యిలో పాతిపెట్టి  హత్య
    Ghaziabad: భార్యను హత్య చేసి, మృతదేహాన్ని 4 రోజులు ఇంట్లో ఉంచి..  హత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025