LOADING...
NEET coaching: నీట్‌, సీయూఈటీ పోటీ పరీక్షల కోసం 1.63 లక్షల మందికి ఉచిత శిక్షణ
నీట్‌, సీయూఈటీ పోటీ పరీక్షల కోసం 1.63 లక్షల మందికి ఉచిత శిక్షణ

NEET coaching: నీట్‌, సీయూఈటీ పోటీ పరీక్షల కోసం 1.63 లక్షల మందికి ఉచిత శిక్షణ

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2025
05:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాఠశాలల విద్యార్థులు NEET, CUET వంటి పోటీ పరీక్షల్లో రాణించేలా దిల్లీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందుకోసం విద్యార్థులకు ఆన్‌లైన్ శిక్షణ అందించేందుకు బిగ్‌ ఇన్‌స్టిట్యూట్, ఫిజిక్స్‌వాలా లిమిటెడ్ సంస్థలతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమం ద్వారా 12వ తరగతి చదువుతున్న దాదాపు 1.63 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. శిక్షణ విధానం దిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బిగ్ ఇన్‌స్టిట్యూట్, ఫిజిక్స్‌వాలాతో పాటు ఎన్‌ఎస్‌డీసీ ఇంటర్నేషనల్, కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సీఎం రేఖాగుప్తా, విద్యాశాఖ మంత్రి ఆశీష్ సూద్ సమక్షంలో సంబంధిత విభాగాల ప్రతినిధులు ఎంవోయూలపై సంతకాలు చేశారు.

Details

 అంశాలపై శిక్షణ 

ఏప్రిల్ 2 నుంచి మే 2 వరకు రోజూ ఆరు గంటల చొప్పున ఆన్‌లైన్ శిక్షణ ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, జనరల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ వంటి సబ్జెక్టులను కవర్ చేస్తూ బోధన కొనసాగనుంది. లక్ష్యం ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యార్థులు మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పొందేలా ప్రోత్సహించనున్నారు. పీడీఎఫ్ నోట్స్, పరీక్షలు, పురోగతిని ట్రాక్ చేసే మాడ్యూల్స్, సందేహాల నివృత్తి వంటి ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Details

ప్రభుత్వ ప్రకటన 

ఈ ప్రోగ్రామ్ పేద విద్యార్థులకు గేమ్ ఛేంజర్‌లా మారనుందని ప్రభుత్వం పేర్కొంది. అగ్రశ్రేణి వైద్య కళాశాలలు, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు విద్యార్థులకు ఈ శిక్షణ దోహదపడనుంది.