LOADING...
Telangana: మార్చి 1 నుంచి పట్టణ మహిళలకు ఉచిత చీరల పంపిణీ : మంత్రి సీతక్క
మార్చి 1 నుంచి పట్టణ మహిళలకు ఉచిత చీరల పంపిణీ : మంత్రి సీతక్క

Telangana: మార్చి 1 నుంచి పట్టణ మహిళలకు ఉచిత చీరల పంపిణీ : మంత్రి సీతక్క

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2026
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మహిళలకు మార్చి 1 నుంచి ఉచిత చీరలను పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి చీరల పంపిణీ లక్ష్యంగా పెట్టినట్టు చెప్పారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 50 లక్షల మంది మహిళలకు చీరలు అందించామని, మిగిలిన 15 లక్షల మందికి సంక్రాంతి సమయానికి పంపిణీ చేయనున్నారు. సీతక్క ఈ వివరాలను శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె వెల్లడించారు.

Details

 మహిళా సంఘాల ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటు

ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం ద్వారా రాష్ట్ర మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు 250 మహిళా స్వయం సహాయ క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి సభ్యురాలికి రూ.22,300 చొప్పున ఇవ్వడం ద్వారా నిర్వహణ, వంటల తయారీపై శిక్షణ అందించామని తెలిపారు. యాదగిరిగుట్ట వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. మేడారంలో బొంగు చికెన్‌ స్టాల్ ను మహిళలకు కేటాయించి, బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందించి 500 చికెన్ షాపులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ప్రతి మండల సమాఖ్యకు బస్సులు అందజేయనున్నట్లు చెప్పారు. మహిళా స్వయం సహాయక బృందాలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే పేదలకు రుణాలు అందిస్తున్నాయని వివరించారు

Advertisement