ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం: రవాణా మంత్రి
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ప్రకటించారు.
కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ)లోని నాలుగు డివిజన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా ఏపీఎల్, బీపీఎల్ కార్డు ఉన్న మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు.
కర్ణాటక
కర్ణాటకలో ప్రస్తుతం 23,978 బస్సులు
తాను కేఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్లతో మాట్లాడినట్లు, పథకం సాధకబాధకాలను చర్చించినట్లు మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన నివేదికను సమర్పిస్తానని పేర్కొన్నారు.
కేబినెట్ సమావేశం అనంతరం సీఎం సిద్ధరామయ్య దీనిపై ప్రకటన చేస్తారని మంత్రి రామలింగారెడ్డి ఆయన చెప్పారు.
కర్ణాటకలో ప్రస్తుతం 23,978 బస్సులు ఉన్నాయి. 1.04 లక్షల మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు.
ప్రతిరోజు 82.51 లక్షల మంది ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణిస్తుండగా, రోజుకు రూ.2,31,332 ఆదాయం సమకూరుతోంది.