Nitin Nabin: బీహార్ నుండి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వరకు.. నితిన్ నబిన్ ఎవరంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. 2026, జనవరి 19న బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక నిర్వహించబడింది. ఈ ఎన్నికలో నామినేషన్ దాఖలు చేసిన ఒక్కరు నితిన్ నబిన్ కాబట్టి, ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆయన 2026, జనవరి 20వ తేదీన 12వ జాతీయ అధ్యక్షుడిగా అధికారిక బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష పదవికి ఒక్కరే నామినేషన్ వేయడంతో నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ వేడుకలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, జి కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్, ఇతర సీనియర్ మంత్రులు పాల్గొని ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
Details
నితిన్ నబిన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
నితిన్ నబిన్ బీహార్ సీనియర్ రాజకీయవేత్త, దివంగత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు. కాయస్త కమ్యూనిటీకి చెందిన ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉపఎన్నికలో బీజేపీ ఆధిష్టానం ఆయనను బరిలోకి దింపింది. అక్కడ ఆయన విజయం సాధించారు. బంకిపూర్ అసెంబ్లీ నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.నాలుగవ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత నితీష్ కుమార్ మంత్రివర్గంలో రాష్ట్ర రోడ్డు నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన ఆయన 12వజాతీయ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. వెస్ట్ బెంగాల్,తమిళనాడు వంటి కీలక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు నితిన్ నబిన్ కీలక పాత్ర పోషించనున్నారు.