LOADING...
India-South Korea: భారత్-దక్షిణ కొరియా సంబంధాలకు కొత్త ఊపు.. కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న నాయకులు
కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న నాయకులు

India-South Korea: భారత్-దక్షిణ కొరియా సంబంధాలకు కొత్త ఊపు.. కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న నాయకులు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 20, 2026
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ-జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి సోమవారం పలు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈ ఒప్పందాలు కీలకంగా మారనున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. అధ్యక్షుడి పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాలు పరస్పర సహకారాన్ని మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపారు.

వివరాలు 

ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 27 బిలియన్ డాలర్లకు చేరుకుంది: మోదీ  

చిప్స్‌ నుంచి షిప్స్‌, ట్యాలెంట్‌ నుంచి టెక్నాలజీ, ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఎనర్జీ వరకు ఇలా ప్రతి రంగంలోని అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా దక్షిణ కొరియాతో భాగస్వామ్యం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇది భవిష్యత్తులో మరింత విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. భారత్-దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ప్రస్తుతం 27 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరాల్లో ఈ వాణిజ్యాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో ఇరు దేశాలు కృషి చేస్తున్నాయని, 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చాలని సంకల్పించుకున్నట్లు వివరించారు.

Advertisement