LOADING...
Year Ender 2025: కుంభమేళా నుంచి కాశ్మీర్ వరకూ.. పర్యాటకులు సందర్శించిన ప్రాంతాలివే!
కుంభమేళా నుంచి కాశ్మీర్ వరకూ.. పర్యాటకులు సందర్శించిన ప్రాంతాలివే!

Year Ender 2025: కుంభమేళా నుంచి కాశ్మీర్ వరకూ.. పర్యాటకులు సందర్శించిన ప్రాంతాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 19, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్న దేశంగా భారత్ మరోసారి నిలిచింది. ఈ ఏడాది కూడా దేశీ, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో భారత్‌ను సందర్శించారు. చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు, బీచ్‌లు, నదీ తీరాలు వంటి విభిన్న ఆకర్షణలతో పర్యాటకులను దేశం ఆకట్టుకుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగి, పర్యాటక ఆదాయం కూడా భారీగా నమోదైంది. ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా సందర్శించబడిన టాప్ పర్యాటక ప్రాంతాల జాబితాలో మహా కుంభమేళా జరిగిన ప్రయాగ్‌రాజ్, కాశ్మీర్, పాండిచ్చేరి, గోవా, లడఖ్, వారణాసి, ఉదయపూర్ వంటి ప్రాంతాలు ముందున్నాయి. వీటిలో అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్లిన మహా కుంభమేళా తొలి స్థానంలో నిలిచింది.

Details

కుంభమేళాకు 100 కోట్లకు పైగా హజరు

ఈ ఏడాది కుంభమేళాకు దాదాపు 100 కోట్లకు పైగా భక్తులు హాజరయ్యారని అంచనా. ఈ సందర్భంగా కొన్ని సందర్భాల్లో తొక్కిసలాట ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ప్రయాగ్‌రాజ్ తర్వాతి స్థానంలో ఎప్పటిలాగే కాశ్మీర్ టాప్ పర్యాటక కేంద్రంగా నిలిచింది. సహజసిద్ధమైన అందాలతో పర్యాటకులను ఆకట్టుకునే కాశ్మీర్‌కు ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చారు. ఏప్రిల్ నెలలో పహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పటికీ, అది కాశ్మీర్ పర్యటనలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాల్ లేక్ సోయగాలు, ఆల్పైన్ గడ్డి మైదానాలు, గుల్మార్గ్ వింటర్ స్పోర్ట్స్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Details

లడఖ్ ప్రాంతంలోని ఎత్తైన ప్రదేశాలను సందర్శించిన పర్యాటకులు

ఇక పాండిచ్చేరిలోని ఫ్రెంచ్ శైలి భవనాలు, ప్రశాంతమైన కోస్తా తీరం పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత గోవా బీచ్‌లు ఎప్పటిలాగే పర్యాటకులకు స్వాగతం పలికాయి. గోవా బీచ్‌లతో పాటు అక్కడి ఇండో-పోర్చుగీస్ సాంస్కృతిక వారసత్వం కూడా సందర్శకులను విశేషంగా ఆకర్షించింది. అలాగే కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలోని ఎత్తైన ప్రదేశాలను పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందర్శించారు. మరోవైపు వారణాసిలోని ఆధ్యాత్మిక క్షేత్రాలకు భక్తులు, పర్యాటకులు పోటెత్తారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్ సరస్సుల వద్ద కూడా ఈ ఏడాది పర్యాటకుల సందడి కొనసాగింది.

Advertisement