LOADING...
TG News: సిడ్నీ దాడితో.. తెలంగాణకు సంబంధం లేదు: డీజీపీ 
సిడ్నీ దాడితో.. తెలంగాణకు సంబంధం లేదు: డీజీపీ

TG News: సిడ్నీ దాడితో.. తెలంగాణకు సంబంధం లేదు: డీజీపీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 19, 2025
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాజాగా ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి స్పందించారు. ఈ ఘటనలో నిందితుడైన సాజిద్‌ అక్రమ్‌ ఆరు సార్లు భారత్‌కు వచ్చారని, అయితే ఈ ఉగ్రఘటనతో హైదరాబాద్‌కు ప్రత్యక్ష సంబంధం లేదని ఆయన తెలిపారు. కాల్పులకు పాల్పడిన సాజిద్‌ అక్రమ్‌ 1998లో ఉపాధి కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఆ తర్వాత యురోపియన్ యువతిని వివాహం చేసుకున్న తరువాత 1998లో భార్యతో కలిసి ఒక్కసారి హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. 2004, 2009 ఫిబ్రవరిలో, 2011 జూన్‌లో, 2016లో ప్రాపర్టీ సెటిల్‌మెంట్‌ కోసం, చివరగా 2022లో తల్లి, సోదరిని చూసేందుకు మాత్రమే వచ్చాడు. బోండీ బీచ్‌లో జరిగిన ఈ ఘర్షణలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిడ్నీ దాడితో.. తెలంగాణకు సంబంధం లేదు: డీజీపీ

Advertisement