
మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చాం: అసెంబ్లీలో సీఎం జగన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో 11.28 ఆర్థిక వృద్ధి రేటు నమోదవుదైందని సీఎం జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలోని 98.6శాతం హామీలను నెరవేర్చినట్లు ప్రకటించారు.
పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. సామాన్యులు, పేదలతోనే తన ప్రయాణం ఉంటుందని, పెత్తందార్లతోనే తన యుద్ధం ఉంటుందని, అదే తన ఎకనామిక్స్, అదే తన పాలిటిక్స్ అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 30.75లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు జగన్ వివరించారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే మార్గనిర్దేశకంగా మారిందనన్నారు.
ఆంధ్రప్రదేశ్
12 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల సంఖ్యను 4లక్షల నుంచి 6లక్షలకు పెంచినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.
వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పరు. తాజగా ఫ్యామిలీ డాక్టర్ అనే విధానాన్ని కూడా తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
సమావేశాలకు అంతరాయం కలిగించిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన 12 మంది శాసనసభ్యులు, వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.