LOADING...
Gallantry Awards: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 1,090 మందికి గ్యాలంట్రీ, సర్వీస్‌ పతకాలు!
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 1,090 మందికి గ్యాలంట్రీ, సర్వీస్‌ పతకాలు!

Gallantry Awards: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 1,090 మందికి గ్యాలంట్రీ, సర్వీస్‌ పతకాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2025
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు, ఫైర్‌ సర్వీస్‌, హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ శాఖల అధికారులకు వివిధ రకాల పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో శౌర్య పురస్కారాలు, రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, ప్రశంసనీయ సేవా పతకాలున్నాయి. మొత్తం 1,090 మందికి గ్యాలంట్రీ/సర్వీస్‌ మెడల్స్‌ అందజేయనున్నట్లు పేర్కొంది. కేంద్ర హోంశాఖ ప్రకటించిన 1,090 పతకాలలో 233 శౌర్య పతకాలు, 99 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 758 ప్రశంసనీయ సేవా పతకాలున్నాయి. విధి నిర్వాహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి అందించే శౌర్య పతకాలలో ఎక్కువ భాగం జమ్ముకశ్మీర్‌ సిబ్బందికే దక్కాయి.

Details

 226 మంది శౌర్య పతకాలు

వీరి తరువాత సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌)సిబ్బంది ఉన్నారు. పోలీసు విభాగంలో 226 మంది శౌర్య పతకాలకు, 89 మంది రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు, 635 మంది ప్రశంసనీయ సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఫైర్‌ సర్వీసులో మొత్తం 62 అవార్డులు ప్రకటించారు. ఇందులో ఆరు శౌర్య పతకాలు, ఐదు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 51 ప్రశంసనీయ సేవా పతకాలున్నాయి. హోంగార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ విభాగంలో ఒక శౌర్య పతకం, 3 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 41 ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి. కరెక్షనల్‌ సర్వీసెస్‌ (జైళ్ల శాఖ)లో 2 రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 31 ప్రశంసనీయ సేవా పకతాలు ఉండడం విశేషం.

Details

తెలంగాణకు ఒక గ్యాలంట్రీ మెడల్‌

రాష్ట్రాల వారీగా చూస్తే — తెలంగాణకు ఒక గ్యాలంట్రీ మెడల్‌, రెండు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 11 ప్రశంసనీయ సేవా పతకాలు ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్‌కు రెండు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 20 ప్రశంసనీయ సేవా పతకాలు లభించాయి. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటించడం సాంప్రదాయం.