LOADING...
Hyderabad: రేపే హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!
రేపే హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!

Hyderabad: రేపే హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 05, 2025
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో శనివారం గణేష్‌ నిమజ్జనాల సందర్భంగా నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానికి ప్రత్యేక రూట్‌ మ్యాప్‌ను కూడా సిద్ధం చేశారు. మొత్తం 5 ట్రాఫిక్‌ డైవర్షన్‌ జంక్షన్లు, 5 పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటుచేశారు.

Details

ట్రాఫిక్‌ డైవర్షన్‌ జంక్షన్లు

1. రాజీవ్‌గాంధీ విగ్రహం 2. రాజ్‌దూత్‌ మార్గం 3. మింట్‌ కాంపౌండ్‌ ఎంట్రన్స్‌ 4. నెక్లెస్‌ 5. ఖైరతాబాద్‌ పోస్టాఫీస్‌ సర్కిల్‌ పార్కింగ్‌ స్థలాలు 1. అంబేద్కర్‌ విగ్రహం 2. ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ 3. ఐమ్యాక్స్‌ అపోజిట్‌ 4. సరస్వతి విద్యామందిర్‌ 5. రేస్‌ కోర్స్‌ రోడ్‌ దగ్గర ప్రత్యేక స్థలం

Details

రెడ్‌ మార్క్‌ లైన్‌లో వాహనాలకు ప్రవేశం ఉండదు

రూట్‌మ్యాప్‌లో రెడ్‌ మార్క్‌ లైన్‌లో వాహనాలకు ప్రవేశం ఉండదు. బ్లూ డాటెడ్‌ లైన్‌ ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తుంది. అలాగే బ్లూ సర్కిల్స్‌ ట్రాఫిక్‌ డైవర్షన్‌ జంక్షన్లను సూచిస్తాయి. ఖైరతాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి ప్రయాణాలు చేయాలనుకునేవారు ఈ రూట్‌మ్యాప్‌ను తప్పనిసరిగా ఫాలో కావాలని సిటీ ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు. ముఖ్యంగా మింట్‌ కాంపౌండ్‌ ఎంట్రన్స్‌ దగ్గర నుంచి ఇక్బాల్‌ మినార్‌-ఓల్డ్‌ సైఫాబాద్‌-నిరంకారి జంక్షన్‌-ఖైరతాబాద్‌ జంక్షన్‌ వరకు ప్రయాణించాలి. ఎన్టీఆర్‌ గార్డెన్స్‌కు వెళ్లాలనుకునే వారు ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ ద్వారా చేరుకోవాలని పోలీసులు సూచించారు.